: మసరత్ పై ప్రజాభద్రతా చట్టం విధింపు... విచారణ లేకుండా డైరెక్టుగా రెండేళ్ల శిక్ష


ఇటీవల జమ్ము కాశ్మీర్ లో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన వేర్పాటువాది మసరత్ ఆలం భట్ ఆ దేశ అనుకూల నినాదాలు చేయడంతో పొలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలంపై కఠినమైన ప్రజాభద్రతా చట్టాన్ని పోలీసులు అమలు చేశారు. ఈ చట్టంతో మసరత్ పై ఎలాంటి విచారణ జరగకుండానే కనీసం రెండు సంవత్సరాల పాటు జైల్లో ఉంటాడు. అంతేగాక రణబీర్ పీనల్ కోడ్ కింద సెక్షన్ 121-ఏ (దేశంపై యుద్ధానికి ప్రేరేపించడం), 124 (దేశద్రోహం), 120-బి (నేరపూరిత కుట్ర), 147 (అల్లర్లు)), ఇంకా చిన్న చిన్న నేరాలను ఆలంపై మోపారు. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఆదేశాలను ఈ నెల 25 వరకు బుడ్గామ్ కోర్టు రిజర్వులో ఉంచిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News