: ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు?: చంద్రబాబుపై టీఆర్ఎస్ ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ పర్యటనపై టీఆర్ఎస్ పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పాలమూరును దత్తత తీసుకున్నామని గొప్పలు చెప్పుకుని, అభివృద్ధి చేయకపోగా, ప్రజలను వలసల బాట పట్టించారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. నేడు ఏ మొహం పెట్టుకుని మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి లేఖరాసిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే చంద్రబాబు పర్యటనలు సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.