: రైతు ఆత్మహత్యపై చర్చకు మేం సిద్ధమే: వెంకయ్యనాయుడు
ఢిల్లీలో ఆప్ ర్యాలీలో చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇటువంటి ఘటన జరగడం విచారకరమని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్య అనేది తీవ్రమైన విషయమన్నారు. లోక్ సభలో ఈరోజు రైతు ఆత్మహత్యపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వెంకయ్య ఈ మేరకు స్పందించారు. విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.