: ముడుపుల నియామకాలపై విశాఖ కలెక్టర్ సీరియస్... 33 మంది కాంట్రాక్టు సిబ్బందిపై వేటు


లంచాలు తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేసిన వ్యవహారంపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ యువరాజ్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో ముడుపులు ముట్టజెప్పి ఉద్యోగాలు దక్కించుకున్న 33 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఇంటికి సాగనంపారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఇటీవల పెద్ద ఎత్తున కాంట్రాక్టు సిబ్బందిని నియమించారు. ఈ నియామకాలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేయించిన కలెక్టర్, ఆరోపణలు వాస్తవమేనని తెలుసుకున్నారు. వెనువెంటనే లంచాలిచ్చి ఉద్యోగాలు పొందిన 33 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన కీలక ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News