: సీన్ రివర్స్... కేజ్రీ ఇంటి ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ధర్నా!
దేశ రాజధానిలో నేటి ఉదయం నిజంగానే సీన్ రివర్సైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిముందు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం యూత్ కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఆందోళనకు దిగింది. నిన్నటి ఆప్ ధర్నాలో పాలుపంచుకున్న ఓ రైతు అందరూ చూస్తుండగానే చెట్టెక్కి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రైతు కుటుంబానికి ఆప్ నష్ట పరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన రెండు పార్టీల నేతలు కేజ్రీని డిమాండ్ చేశారు. అసలు కేజ్రీ ఇంటిని ముట్టడించేందుకే రెండు పార్టీల నేతలు ముందుగా అనుకున్నా, సమయానికి స్పందించిన పోలీసులు వారి యత్నాన్ని విఫలం చేశారు. ఈ ఆందోళనను చూసి కేజ్రీ షాక్ తిన్నారట. ఎందుకటే, ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేసే హక్కు తనకొక్కడికి మాత్రమే ఉందనే భావనతో గతంలో ఆయన సీఎం హోదాలో యూపీఏ సర్కారుపై సమర శంఖం పూరించారు. ఆ సందర్భంగా ఆయన పదవినీ వదిలేసుకున్నారు. అయితే, ఊహించని విధంగా తన ఇంటిముందు అటు అధికార బీజేపీతో పాటు, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆందోళనకు దిగడంతో ఆయన కంగు తిన్నారు.