: బీహార్ లో 42కు పెరిగిన తుపాను మృతుల సంఖ్య... సాయం అందిస్తామని మోదీ హామీ


బీహార్ లో తుపాను సృష్టించిన బీభత్సంతో మృతుల సంఖ్య 42కు పెరిగింది. దాదాపు 80 మందికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ రాష్ట్రంలో పరిస్థితిపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడిన ఆయన కేంద్రం నుంచి పూర్తి సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. నితీశ్ మాట్లాడుతూ, పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందని, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. కాగా మొన్న రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో పుర్ణియా, మదేపురా, ఇతర జిల్లాలు తుపాను బీభత్సానికి అతలాకుతలమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News