: 'సూపర్ ఓవర్'కు ఆవగింజంత విలువ కూడా లేదట!


ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పోటీల్లో ఏదైనా మ్యాచ్ లో రెండు జట్ల స్కోర్లూ సమానంగా నిలిస్తే ఫలితం కోసం సూపర్ ఓవర్ వేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓవర్లో తీసే పరుగులు లేదా వికెట్లను ఆటగాడి వ్యక్తిగత రికార్డుల్లో, జట్టు రికార్డుల్లో కలపరు. గణాంకాల్లో ఏ జట్టు ఎవరిని ఓడించిందో చెబుతారు. అంతేగానీ, గణాంకాల్లో, నెట్ రన్ రేట్లో వీటిని కలిపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్లో పంజాబ్ జట్టు గెలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News