: మధురలో బచ్చా గ్యాంగ్ స్వైర విహారం... పోలీసునే దోచేసిన తొమ్మిదేళ్ల బాలిక!
కరుడుగట్టిన నేరస్తుల కేంద్రమైన బీహార్ లోని మధుర నగరం పిల్ల దొంగలకు కూడా నిలయమట. నిండా పదేళ్లు కూడా లేని పిల్ల దొంగలతో కూడిన బ్యాచ్ లను అక్కడి పోలీసులు ‘బచ్చా గ్యాంగ్’లని పిలుస్తారు. ఈ గ్యాంగ్ కు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక, ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ నే నిలువునా దోచుకుంది. వందో, వెయ్యో కాదండి బాబూ, అక్షరాలా రూ.4.02 లక్షల రూపాయలట. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని బయటకు వచ్చిన కానిస్టేబుల్ విజయ్ పాల్ సింగ్ ను ఆపేసిన బాలిక, 'మీ ప్యాంటుకేదో రంగు అంటుకుంది చూడండి' అంటూ ఏమార్చింది. చిన్నారి బాలిక చెబుతోంది కదా అని భావించిన ఆయన డబ్బు ఉన్న బ్యాగును కింద పెట్టి ప్యాంటు చూసుకోసాగాడట. అంతే, రెప్పపాటు వ్యవధిలో సదరు బ్యాగుతో ఆ బాలిక మాయమైందట. దీంతో కంగుతిన్న కానిస్టేబుల్, ఆ తర్వాత తీరికగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.