: శాఖలపై ఇంకెప్పుడు పట్టు సాదిస్తారు?: ఏపీ మంత్రులకు చంద్రబాబు క్లాస్
ఏపీ మంత్రులకు సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ఊహించని షాక్ ఇచ్చారు. ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చంద్రబాబు, తన కేబినెట్ మంత్రులకు మాత్రం క్లాస్ పీకారు. అధికారం చేపట్టి 11 నెలలవుతోంది, శాఖలపై ఇంకెప్పుడు పట్టు సాధిస్తారంటూ ఆయన నిలదీయడంతో మంత్రుల నోట మాట రాలేదు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో భాగంగా చంద్రబాబు ఈ మేరకు దాదాపు అందరు మంత్రులకూ సుదీర్ఘ క్లాస్ పీకారు. చిన్న చిన్న విషయాలను కూడా కేబినెట్ భేటీల్లో ప్రస్తావించిన మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత మంత్రులుగా మీపై ఉంది. ఈ విషయంలో అధికారులు సహకరించకపోతే, వారిని సస్పెండ్ చేయండి. ఈ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు. త్వరగా శాఖలపై పట్టు సాధించాల్సిందే’’ అని చంద్రబాబు క్లాస్ పీకారు. అదే సమయంలో మెరుగ్గా రాణిస్తున్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబులను చంద్రబాబు మెచ్చుకున్నారట.