: సికింద్రాబాదు రీజియన్ లో ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె... నిలిచిపోయిన వెయ్యి బస్సులు


సికింద్రాబాదు రీజియన్ పరిధిలోని ఆర్టీసీ కార్మికులు నేటి ఉదయం మెరుపు సమ్మెకు దిగారు. ఉద్యోగుల సస్పెన్షన్ పై భగ్గుమన్న కార్మికులు సికింద్రాబాదు పరిధిలోని అన్ని డిపోల్లో సమ్మెకు దిగారు. దీంతో దాదాపు వెయ్యికి పైగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. సమ్మెలో భాగంగా కార్మికులు కంటోన్మెంట్ డిపో ముందు ఆందోళనకు దిగారు. ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు నినదిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కార్మికులు సమ్మెకు దిగడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు. కార్మికులతో చర్చలు జరిపి, ఆందోళనను విరమింపజేసే యత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News