: రాష్ట్రం తెచ్చుకున్నది వేరెవరినో సీఎం చేయడానికి కాదు: టీ హోం మంత్రి నాయిని వ్యాఖ్య!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది వేరెవరినో సీఎం చేయడానికి కాదని టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అంతేకాక ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎవరినో మంత్రిగా చేయడానికి కూడా కాదని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తద్వారా అధికార కాంక్షను ఆయన బయటపెట్టుకున్నారు. ఇప్పటికే తొలి సీఎం పదవిని దళితుడికే అప్పగిస్తామంటూ మాట ఇచ్చి కేసీఆర్ తప్పారని విపక్షాలు మండిపడుతుంటే, తాజాగా నాయిని చేసిన వ్యాఖ్యలు దానికి ఆజ్యం పోసినట్లైంది.