: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... మే 1 నుంచే చేతికందనున్న కొత్త వేతనాలు
ఏపీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర మంత్రివర్గం శుభవార్తను అందించింది. భారీగా పెరిగిన వేతనాలను వచ్చే నెల నుంచే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిన్నటి భేటీలో ఏపీ కేబినెట్ తీర్మానించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. తెలంగాణ సర్కారు కంటే ఒక్క శాతం తగ్గినా ఫిట్ మెంట్ ను అంగీకరించేది లేదన్న ఉద్యోగుల వాదన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా 43 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించింది. అయితే పెంచిన వేతనాలు ఇప్పటిదాకా ఉద్యోగులకు అందనే లేదు. ఉద్యోగుల విన్నపాలకు స్పందించిన చంద్రబాబు నిన్నటి కేబినెట్ భేటీలో దీనిపై ప్రత్యేకంగా చర్చించి, మే 1 నుంచే కొత్త వేతనాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు.