: భారత సంతతి మిలియనీర్ చేతివాటం


బ్రిటన్లో భారత సంతతికి చెందిన ఓ మిలియనీర్ చేతివాటం ప్రదర్శించి కోర్టు బోనెక్కాడు. వివరాల్లోకెళితే... బర్మింగ్ హామ్ లోని వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ప్రాంతంలో రోనాన్ ఘోష్ (39) అనే వ్యాపారవేత్త టెస్కో అవుట్ లెట్ కు వెళ్లాడు. అయితే, ట్రాలీలో ఉన్న వస్తువులకే బిల్లు చెల్లించిన అతడు, తన వద్ద ఉన్న బ్యాగులో మాంసం ఉత్పత్తులు, వైన్ దాచడంతో దొరికిపోయాడు. ఖరీదైన వస్తువులు బ్యాగులోకి తోయడం స్టోర్ లో ఉన్న కెమెరాల కంటచిక్కింది. దీంతో, అక్కడి భద్రత సిబ్బంది ఆ మిలియనీర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసును విచారించిన బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు ఘోష్ ను దోషిగా తేల్చి ఏడాదిపాటు సామాజిక సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. కోర్టులో విచారణ సందర్భంగా ఘోష్, తాను ప్రియురాలితో గొడవపడిన అనంతరం మార్కెట్ కు వచ్చానని తెలిపాడు. ఆ వస్తువులు దొంగిలించాలన్న ఉద్దేశం తనకు లేదని విన్నవించాడు. ఘోష్ ఆర్జీ రీసైక్లింగ్ కంపెనీకి డైరక్టర్ అని డిఫెన్స్ న్యాయవాది చరణ్ జిత్ జుట్లా కోర్టుకు తెలిపారు. ఆ సంస్థ రీసైక్లింగ్ పరిశ్రమకు విలువైన యంత్రాలను సరఫరా చేస్తుంటుందని వివరించారు. సోలీహల్ ప్రాంతంలో సుమారు రూ.5.20 కోట్ల విలువైన అధునాతన భవంతిలో నివసించే ఈ మిలియనీర్, కేసు నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఎన్ని ప్రణాళికలు వేసినా ఫలించలేదు.

  • Loading...

More Telugu News