: వైజాగ్ లో సన్ రైజర్స్ జయకేతనం
డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యం కుదించగా, 118 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్దేశిత 12 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఓ దశలో మ్యాచ్ ఆసక్తికరంగా మారినా, నైట్ రైడర్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. సన్ రైజర్స్ జట్టులో మొత్తం ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం. అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని కుదించారు.