: చంద్రబాబుకు భగవంతుడే అండ: ఎర్రబెల్లి


తప్పుచేసిన వారిని శిక్షిస్తున్నందునే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని, ఆయనకు భగవంతుడే అండగా ఉంటారని టీడీపీ తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు సుఖంగా ఉంటారని, ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. గతంలో మావోయిస్టులను నియంత్రించినందుకు ఆయనపై దాడి చేశారని, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు కక్షగట్టారని వివరించారు. చంద్రబాబుకు ఏమీకాదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు హత్యకు ఎర్రచందనం స్మగ్లర్లు కుట్ర పన్నారన్న సమాచారం అందడంతో ఏపీ ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులను అప్రమత్తం చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News