: కాంగ్రెస్ కు నాయకత్వం వహించేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారు: శశి థరూర్
కాంగ్రెస్ పార్టీకి ఎవరు సారథ్యం వహిస్తారంటూ గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. పార్టీలో తరాల మార్పు అనివార్యమైందన్నారు. పార్టీ నాయకత్వ విషయంపై రాహుల్ గాంధీ ఎప్పుడు స్పందిస్తారోనని, తల్లి సోనియాగాంధీ నుంచి నాయకత్వ బాధ్యతలను ఎప్పుడు తీసుకుంటారోనని పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారన్నారు. అయితే పార్టీలో అన్ని విభాగాల వారు ఆయన్ను అంగీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రాహుల్ పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని థరూర్ స్పష్టం చేస్తున్నారు. రాహుల్ పై మీడియా వ్యతిరేక భావనను సృష్టిస్తోందని నిందించారు. అందుకే ఆయనను ట్విట్టర్ లో చేరమని తాను కోరినట్టు థరూర్ తెలిపారు.