: 'స్వచ్ఛభారత్'కు స్టాక్ మార్కెట్ రూ.కోటి విరాళం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునందుకుని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చింది. బీఎస్ఈ చైర్మన్ డాక్టర్ ఎస్.రామదురై ఈ మేరకు చెక్ అందించారు. కార్పొరేట్ సంస్థలు, ఇతర సంస్థల నుంచి భాగస్వామ్యాన్ని ఆశిస్తూ 'స్వచ్ఛభారత్ కోష్' పేరిట కేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించడం తెలిసిందే. గతేడాది గాంధీ జయంతి నాడు ప్రధాని మోదీ క్లీన్ ఇండియా పేరిట భారీ కార్యాచరణకు తెరదీశారు. బహిరంగ ప్రదేశాలు, పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. స్వచ్ఛభారత్ కోష్, క్లీన్ గంగా ఫండ్ కు అందించే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపునిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు కూడా.

  • Loading...

More Telugu News