: మంత్రి గిరిరాజ్ ను ప్రధాని తిట్టారన్న వార్తలు ఓ గిమ్మిక్: కాంగ్రెస్


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శరీర రంగుపై వ్యాఖ్యలకు గానూ రెండు రోజుల కిందట కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లోక్ సభలో పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక సదరు మంత్రిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన కార్యాలయానికి పిలుపించుకుని తిట్టారని, దాంతో గిరిరాజ్ కన్నీరుపెట్టారంటూ వార్తలు వచ్చాయి. అయితే అసలలాంటిదేమీ జరగలేదని తరువాత గిరిరాజ్ ఖండించారు. కానీ ఈ వ్యవహారాన్నంతా కాంగ్రెస్ ఓ 'గిమ్మిక్'గా కొట్టిపారేసింది. "తనను పిలిచి ప్రధాని చివాట్లు పెట్టారనడాన్ని మంత్రి ఇప్పటికే ఖండించారు. అదీగాక, ఈ ఎపిసోడ్ జరిగిన నెల తర్వాత ప్రధాని ఆయనను తిట్టడమేమిటి? ఇదంతా చూస్తుంటే ఓ గిమ్మిక్కులా వుంది. ఇలాంటి గిమ్మిక్సుకి రాజకీయాల్లో తావులేదు" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు.

  • Loading...

More Telugu News