: హైదరాబాదులో పలు చోట్ల వర్షం... సచివాలయం ఎదుట హోర్డింగ్ కూలి ఇద్దరికి గాయాలు


హైదరాబాదు నగరంలో పలు చోట్ల ఈ సాయంత్రం వర్షం కురిసింది. పంజాగుట్ట, కూకట్ పల్లి, మోతీనగర్, హిమాయత్ నగర్, నాంపల్లి, మూసాపేట, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో వర్షం పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అమీర్ పేట, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అటు, సచివాలయం ఎదుట హోర్డింగ్ కూలిపోయింది. ఆ హోర్డింగ్ పడడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News