: ఐఎస్ చీఫ్ గాయపడినట్టు ఆధారాల్లేవు: పెంటగాన్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో గాయపడ్డాడని గార్డియన్ పత్రికలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అల్ బాగ్దాదీ గాయపడ్డాడని చెప్పడానికి ఆధారాల్లేవని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై పెంటగాన్ ప్రతినిధి కల్నల్ స్టీవెన్ వారెన్ స్పందిస్తూ, ఆ గాయపడిన వ్యక్తి బాగ్దాదీయే అని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అమెరికా బాగ్దాదీ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించడం తెలిసిందే.