: వైజాగ్ లో పరుగులు పోటెత్తేనా?... నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఢీ
విశాఖపట్నం వీడీసీఏ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ కు వీక్షకులు పోటెత్తారు. కోల్ కతా నైట్ రైజర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ సందర్భంగా పరుగులు వెల్లువెత్తుతాయని ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వార్నర్, ధావన్, బొపారా, కేఎల్ రాహుల్ తో సన్ రైజర్స్ బ్యాటింగ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో స్టెయిన్, భువనేశ్వర్ కుమార్, ప్రవీణ్ లు సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. అటు, కోల్ కతా జట్టు ప్రతిభావంతులతో పొంగిపొర్లుతోంది. గంభీర్, ఊతప్ప, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, ఆండ్రీ రస్సెల్ తో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే సత్తా ఉన్నదే. ఈ కారణంగానే టాస్ నెగ్గిన గంభీర్ మరో ఆలోచన లేకుండా ఛేదనకే మొగ్గుచూపినట్టు అర్థమవుతోంది.