: మీ అబ్బాయిని చూసి యాక్టింగ్ నేర్చుకో!: మమ్ముట్టికి వర్మ సలహా
దర్శకుడు రాంగోపాల్ వర్మ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మమ్ముట్టి కంటే ఆయన కొడుకే బెటర్ అంటూ ట్వీట్ చేశారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం' చిత్రాన్ని వీక్షించిన అనంతరం ట్విట్టర్ వేదికగా వర్మ స్పందించారు. ఆ సినిమాలో దుల్కర్ ను చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. దుల్కర్ కు, మమ్ముట్టికి చాలా అంతరం ఉందని, కొడుకుతో పోల్చితే మమ్ముట్టిని ఓ జూనియర్ ఆర్టిస్టుగానే భావించాల్సి ఉంటుందని విమర్శించారు. ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న మమ్ముట్టి కేరళ గర్వపడేలా చేయలేకపోయారని, దుల్కర్ కొద్ది కాలంలో ఆ పని చేయగలడని అభిప్రాయపడ్డారు. అవార్డు కమిటీ సభ్యులకు ఏమాత్రం విజ్ఞత ఉన్నా, మమ్ముట్టికి ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసుకుని, వాటిని దుల్కర్ కు ఇస్తారని సెలవిచ్చాడు.