: నటి జయప్రదకు విశిష్ట పురస్కారం
తన అందం, నటనతో ప్రేక్షకులను రంజింపజేసి, ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన జయప్రదకు విశిష్ట పురస్కారం లభించింది. సినీ రంగంలో కనబర్చిన ప్రతిభకు గుర్తింపుగా 'కళాశ్రీ' అవార్డుకు జయప్రదను ఎంపిక చేశారు. దాదా సాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ అవార్డును మంగళవారం ముంబైలో ఈ మాజీ ఎంపీకి అందజేసింది. ఈ సందర్భంగా, జయప్రద మాట్లాడుతూ... ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాదా సాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ కు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ సినీ రంగానికి ఇదే ఉత్సాహంతో సేవలందిస్తానని చెప్పారు.