: న్యూజిలాండ్ ప్రధాని కొంటెతనం!
న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ కాస్త చిలిపివాడే! ప్రాక్టికల్ జోకులతో సరదాగా ఉండడం ఆయన నైజం. అయితే, ఎప్పట్లానే తమాషా చేయబోయి కాస్తంత ఇబ్బంది పడ్డారు. ఆక్లాండ్ లోని ఓ కేఫ్ లో పనిచేస్తున్న వెయిట్రెస్ జట్టు పట్టుకుని లాగి, చివరికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. ఆమె పోనీ టెయిల్ ను ఎన్నోమార్లు లాగి కవ్వించేందుకు ప్రయత్నించారట జాన్ కీ. గతేడాది నవంబర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ కేఫ్ కు ప్రధాని వచ్చారరు. అప్పటి నుంచి ఆ కేఫ్ కు ఎప్పుడు వచ్చినా తన పోనీ టెయిల్ ను లాగందే ఆయన నిష్క్రమించేవారు కారని ఆ వెయిట్రెస్ పేర్కొంది. తన జట్టు అలా లాగడం తనకు ఇష్టంలేదని ఆయన భద్రత సిబ్బందితో కూడా చెప్పానని గుర్తుచేసుకుంది. చివరికి, గత నెలలో వ్యక్తిగతంగా ప్రధానితో మాట్లాడి, అలా లాగవద్దని కోరానని తెలిపింది. అయినా, వినలేదని, తన కొంటెతనాన్ని కొనసాగించారని వాపోయింది. చివరికి వాస్తవాన్ని గ్రహించి, క్షమాపణలు తెలిపి రెండు వైన్ బాటిళ్లు ఇచ్చారని వెల్లడించింది.