: ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం... అటవీ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉదయం 10.30 గంటల సమయంలో ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2.30కు ముగిసింది. దాదాపు మూడున్నర గంటలకుపైగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు చర్చించారు. ముందుగా అటవీ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీరు, చెట్టు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించింది. దానికోసం 6 జిల్లాలకు రూ.20 కోట్లు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ పరిధిని 225 నుంచి 350 కిలో మీటర్లకు పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం, రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్ ఎంపిక అంశాన్ని చర్చించింది. ఓపెన్ టెండర్ల ద్వారా మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయాలనుకుంది. 43 శాతం పీఆర్సీ ప్రకారం బకాయిల చెల్లింపులపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. దానిపై తదుపరి మంత్రివర్గంలో చర్చించాలని నిర్ణయించారు.