: బుధగ్రహంపై కూలిపోనున్న 'మెసెంజర్'
బుధగ్రహంపై మరో రెండు వారాల్లో మెసెంజర్ అనే వ్యోమనౌక కూలిపోనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీన్ని 2004లో కేప్ కెనవరాల్ ప్రయోగ కేంద్రం రోదసిలోకి పంపగా, ఇప్పుడు దాంట్లో ఇంధనం అయిపోవచ్చింది. ఈ నెల 30న మెసెంజర్ బుధగ్రహాన్ని ఢీకొంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కూలిపోయే సమయంలో దీన్ని వీక్షించలేమని తెలిపారు. గంటకు 8,700 మైళ్ల వేగంతో ఇది బుధ గ్రహ ఉపరితలాన్ని ఢీకొంటుందని నాసా సైన్స్ మిషన్ డైరక్టరేట్ అధిపతి జాన్ గ్రన్స్ ఫెల్డ్ వివరించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను కోల్పోతున్నందుకు విచారిస్తున్నామని, అయితే, అది అద్భుతమైన సేవలందించిందని తెలిపారు. మెర్క్యురీ సర్ఫేస్, స్పేస్ ఎన్విరాన్ మెంట్, జియోకెమిస్ట్రీ అండ్ రేంజింగ్ కి సంక్షిప్త రూపమే మెసెంజర్.