: పైరవీలు లేకుండానే అనుమతులు... పారిశ్రామికవేత్తలకు టీ సీఎం కేసీఆర్ హామీ
తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు పైరవీలు లేకుండానే అనుమతులిస్తామని టీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా అండ్ మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన వాహనాల తయారీ ప్లాంట్ ను కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలతో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున ఏం చేయాలో, అన్నీ క్షణాల్లో పూర్తి చేస్తామన్నారు. అంతేకాక రాష్ట్రంలో విద్యుత్ కోతల సమస్యే లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.