: విదేశీ పర్యటనలు ఆపితే ప్రజా సమస్యలు తెలుస్తాయి... చంద్రబాబుపై రోజా విమర్శలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. నిత్యం సింగపూర్, మలేషియా టూర్లంటూ తిరిగే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయని ఆమె మండిపడ్డారు. విశాఖకు వచ్చిన ఆమె కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. అసలు సింగపూర్, మలేషియా, చైనాల్లో చంద్రబాబు ఎందుకు పర్యటిస్తున్నారో ఆయన పార్టీ నేతలకే అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు. విదేశీ టూర్లు ఆపితే చంద్రబాబుకు ప్రజల సమస్యలు అర్థమవుతాయని ఆమె సూచించారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, బెల్టు షాపులపై వైసీపీ పోరాటం సాగిస్తుందని ఆమె చెప్పారు.