: కర్నూలు జిల్లాలో డబ్బుల మూటలు... ఎవరివన్న విషయంపై నోరు విప్పని పోలీసులు


కర్నూలు జిల్లా చాగలమర్రి మరోమారు వార్తల్లోకెక్కింది. మొన్నటికి మొన్న ఎర్రచందనం కేసులో చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలి అరెస్టయ్యాడు. పోలీసుల విచారణలో అతడు సినీ నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నీతూ అగర్వాల్ తో సహజీవనం కూడా సాగించినట్టు వెల్లడయింది. తాజాగా నిన్న రాత్రి చాగలమర్రి మండలంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో లక్షల కొద్ది డబ్బుల మూటలు పట్టుబడ్డాయి. అనధికారిక సమాచారం మేరకు రూ.40 లక్షల మేర నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ నగదుతో పట్టుబడిన ఓ వ్యక్తిని పోలీసులు ఏఎస్పీ ముందు ప్రవేశపెట్టారు. అయితే సదరు వ్యక్తి వివరాలు కాని, పట్టుబడిన మొత్తం ఎంత, ఎవరిదన్న విషయాన్ని కాని పోలీసులు బయటపెట్టడం లేదు. ఈ డబ్బంతా ఓ రాజకీయ నాయకుడిదేనన్న ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News