: తమిళ పరిశ్రమలకు నిరసనగా రోడ్డెక్కిన చిత్తూరు జిల్లా మహిళలు!
శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులోని ఏపీ పరిశ్రమలు, బస్సులు, వాణిజ్య సముదాయాలపై తమిళ తంబీలు దాడులు చేశారు. తాజాగా ఏపీలోని తమిళనాడుకు చెందిన డైయింగ్ పరిశ్రమలను మూసివేయాలని చిత్తూరు జిల్లాలో మహిళలు రోడ్డెక్కారు. అయితే ఈ ఆందోళనలు శేషాచలం ఎన్ కౌంటర్ బ్యాక్ డ్రాప్ గా సాగుతున్నవి కాదులెండి. ఆ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని చెబుతున్న మహిళలు చిత్తూరు జిల్లా నగరిలో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు పలువురు మహిళలను అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామైంది.