: ఒవైసీ సోదరులు రాక్షసులంటూ శివసేన వ్యాఖ్య


ముస్లింల ఓటింగ్ హక్కులు ఉపసంహరించాలంటూ కొన్ని రోజుల ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన తాజాగా ఎంఐఎం పార్టీ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలను లక్ష్యం చేసుకుంది. దేశానికి పెద్ద ప్రమాదకరమైన ఆ సోదరులిద్దరూ 'రాక్షసులు' అంటూ పేర్కొంది. పార్టీ పత్రిక సామ్నాలో ఈరోజు రాసిన ఆవేశపూరిత సంపాదకీయంలో ఈ మేరకు వారిద్దరిపై సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ముంబయిలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఈ సోదరులిద్దరూ మతం రంగు పులమాలనుకుంటున్నారని ఆరోపించింది. వారిద్దరూ పాకిస్థాన్ అనుకూల వ్యక్తులంటూ సంపాదకీయంలో పేర్కొన్న సేన... దేశానికి వారేమి చేయలేరని, ఔరంగాబాద్, నవీ ముంబయిలో పొరుగు దేశ జెండాను ఎగురవేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తింది. ఇటీవల బాంద్రా ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎంఐఎం ఓటమిపాలైన నేపథ్యంలో దాన్నుంచైనా ఒవైసీ సోదరులు పాఠం నేర్చుకోవాలని సేన సూచించింది. కాగా సేన, బీజేపీ కూటమి ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News