: హుక్కా సెంటర్లలో ప్రముఖుల పిల్లలు... కౌన్సిలింగ్ తో సరిపెట్టిన పోలీసులు
హైదరాబాదులో హుక్కా కల్చర్ నానాటికి విస్తరిస్తోంది. ప్రముఖుల ఆవాస ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వెలుస్తున్న ఈ హుక్కా సెంటర్లలో మైనారిటీ తీరని పిల్లలు సైతం జల్సా చేస్తున్నారు. ఇదే అదనుగా హుక్కా సెంటర్ల యాజమానులు నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న రాత్రి పోలీసులు హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో రెండు హుక్కా సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఈ హుక్కా సెంటర్లలో మైనారిటీ తీరని కొంతమంది పిల్లలు హుక్కా పీలుస్తూ పోలీసులకు దొరికిపోయారు. హుక్కా సెంటర్లను సీజ్ చేసిన పోలీసులు సెంటర్ల యజమానులతో పాటు, పట్టుబడ్డ పిల్లలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. తీరా విచారిస్తే, సదరు పిల్లలంతా నగరంలో ప్రముఖ వ్యక్తులుగా చెలామణి అవుతున్న వారి పిల్లలని తేలింది. దీంతో వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు ఆ తర్వాత వారిని ఇళ్లకు పంపేశారు.