: సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అటవీ సంపద దోపిడీ చట్టాన్ని కఠినతరం చేసే ప్రతిపాదన, ఉద్యోగుల పీఆర్సీ పెంపు అంశాలపై చర్చిస్తున్నారు. అంతేగాక రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్ ఎంపిక, టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పలువురు మంత్రులు సమావేశానికి హాజరయ్యారు.