: పేరుకు పరిశుద్ధబాబు... చేసేవన్నీ పాడు పనులు!
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో క్రైస్తవ ఆశ్రమం తెరిచిన ఆ వ్యక్తి పేరు పరిశుద్ధ బాబు. పేరుకే అతడు పరిశుద్ధ బాబు, చేసేవన్నీ అపరిశుద్ధమైన పనులేనట. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన అతడి నీచ కార్యాలపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా అతడి మాయలో పడ్డ పోలీసులు కేసు నమోదు చేసే విషయంలో నీళ్లు నమిలారు. దీంతో అతగాడి వేధింపులతో విసిగివేసారిన ఓ విద్యార్థిని ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీగారి ఆదేశాలతో ఎట్టకేలకు మత్తు వీడిన చిలకలపూడి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న పరిశుద్ధ బాబు గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.