: మద్యం మత్తులో యువతుల ర్యాష్ డ్రైవింగ్....బైక్, ఐస్ క్రీం బండిని ఢీకొట్టి పరార్


మద్యం మత్తు తలకెక్కిన హైదరాబాదు యువతులు నేటి తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. పూటుగా మద్యం సేవించి హోండా సిటీ కారులో రోడ్లపైకి వచ్చిన నలుగురు యువతులు బంజారాహిల్స్ రోడ్ నెం:2పై ర్యాష్ గా దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన ఓ బైక్ తో పాటు ఓ ఐస్ క్రీం బండిని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ తో పాటు ఐస్ క్రీం బండి పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్దారు. గమనించిన స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల రంగ ప్రవేశాన్ని గమనించిన నలుగురు యువతులు కారును రోడ్డుపైనే వదిలి పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News