: నేనీమాట చెబితే ఆంధ్రోళ్లకు కోపం వస్తుంది: కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు! తానో మాట చెబుతానని, ఆ మాట చెబితే ఆంధ్రోళ్లకు కోపం వస్తుందని, కానీ, చేయగలిగిందేమీలేదని అన్నారు. అయినా, ఇది కఠోరవాస్తవమని తెలిపారు. ఆంధ్రులు 'ఆదికవి నన్నయ అవతరించిన నేల' అని పాట రాస్తారని, తెలుగులో ఆదికవి నన్నయ కాదని, పాల్కురికి సోమనాథుడు అని ఉద్ఘాటించారు. నన్నయ మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన అనువాదకుడు మాత్రమేనని, కానీ, సోమనాథుడు తెలుగులో బసవేశ్వరపురాణాన్ని రచించాడని, అది ప్రథమ కావ్యమని చెప్పారు. ఇది చరిత్ర తెలిసిన వాళ్లందరికీ విదితమేనని, అలా కాదని వాదించేవాళ్లకు చెప్పి ప్రయోజనంలేదని అన్నారు. హైదరాబాదు రవీంద్రభారతిలో బసవేశ్వర జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News