: హైదరాబాదులో ఇంటికి వెళుతున్న ఉపాధ్యాయుడిని చితకబాదిన విద్యార్థి
విద్యార్థులను సన్మార్గంలో పెట్టే క్రమంలో ఉపాధ్యాయులు ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఈ టీచర్ కూడా అలాగే చేశాడు. కానీ, అతడి చేతిలో దెబ్బతిన్న విద్యార్థి మాత్రం పగతో రగిలిపోయాడు. ఫలితం... టీచర్ ఆసుపత్రి పాలయ్యాడు. వివరాల్లోకెళితే... హైదరాబాదు కూకట్ పల్లిలో స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న ఉపాధ్యాయుడిపై సదరు విద్యార్థి దాడి చేశాడు. ఒంటరిగా దొరికిన టీచర్ ను చితకబాదాడు. దీంతో, ఆయనకు తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ఆరంభించారు. దండించినంత మాత్రాన టీచర్ పైనే దాడి చేయడమేంటని, స్థానికులు ముక్తకంఠంతో విద్యార్థి చర్యను ఖండిస్తున్నారు.