: టాస్ గెలిచిన పంజాబ్... రాయల్స్ కు బ్యాటింగ్ అప్పగింత


ఐపీఎల్ లో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా టాస్ వేశారు. టాస్ ను గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో, రాయల్స్ బ్యాటింగ్ కు దిగనున్నారు. రాయల్స్ జట్టు రహానే, వాట్సన్, కెప్టెన్ స్మిత్ వంటి బ్యాటింగ్ స్టార్లతో ఉంది. అటు, పంజాబ్ జట్టులో విధ్వంసక మ్యాక్స్ వెల్ ఉండడంతో మ్యాచ్ లో అందరి కళ్లూ అతడిపైనే ఉండనున్నాయి. ఈ లీగ్ లో పెద్దగా రాణించలేకపోతున్న ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఈ మ్యాచ్ లోనైనా సత్తా చాటాలని పంజాబ్ యాజమాన్యం ఆశిస్తోంది.

  • Loading...

More Telugu News