: రైతులం కాబట్టే ఇజ్రాయెల్ వెళుతున్నాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


తాము మొదట రైతులమని, ఆ తర్వాతే ఎమ్మెల్యేలమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి ఉద్ఘాటించారు. వ్యవసాయం తమ వృత్తి అని, రాజకీయాలు ప్రవృత్తి అని స్పష్టం చేశారు. కరీంనగర్ లోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వారు మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయ నేపథ్య కుటుంబాల నుంచి వచ్చామని తెలిపారు. వ్యవసాయం రంగంలో అధునాతన పద్ధతులు, మార్పులను పరిశీలించేందుకే ఇజ్రాయెల్ వెళుతున్నామని, వ్యవసాయంపై తమ శ్రద్ధను సర్కారు గుర్తించిందని, అందుకే, ఇజ్రాయెల్ లో జరిగే వ్యవసాయ సంబంధ ప్రదర్శనకు తమను పంపిస్తోందని వారు వివరించారు. అంతకుముందు, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సొంత వ్యాపారాలు చక్కబెట్టుకునేందుకు వారు ఇజ్రాయెల్ వెళుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News