: మండు వేసవిలో బీరు లారీ బోల్తా... సీసాల కోసం ఎగబడిన స్థానికులు

ఎండలు మండుతున్న సమయంలో బీరు సేవనం ఎంతో హాయినిస్తుందని మందుబాబులు చెబుతుంటారు. అలాంటివారికి, కొనే అవసరం లేకుండా అయాచితంగా బీరు బాటిళ్లు లభ్యమైతే ఇక చెప్పేదేముంది! నెల్లూరు జిల్లాలో ఇలాగే జరిగింది. నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాలెం వద్ద బీరు లోడుతో వెళుతున్న లారీ బోల్తాపడింది. రోడ్డుపై బీరు లారీ తిరగబడిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఇంకేముంది, ఘటనస్థలానికి స్థానికులు పోటెత్తారు. అందినకాడికి బీరు సీసాలు పట్టుకువెళ్లారు. క్షణాల్లో లోడును ఖాళీ చేశారట.