: హైదరాబాదులోని కార్పోరేట్ ఆసుపత్రుల మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
హైదరాబాదులోని 11 కార్పోరేట్ ఆసుపత్రుల మందుల దుకాణాల్లో ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు నిర్వహించారు. సహాయ సంచాలకుడు, ముగ్గురు డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో పదకొండు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశారు. ఆరు ఆసుపత్రుల్లోని మందుల దుకాణాల్లో తీవ్ర ఉల్లంఘనలు, రెండు ఆసుపత్రుల్లో స్వల్ప ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్టు ఔషధ నియంత్రణ అధికారులు గుర్తించారు. దాంతో మందుల దుకాణాలపై న్యాయపరమైన చర్యలకు ఆదేశించారు. రెండు ఆసుపత్రుల్లో లైసెన్సులు లేని మందుల దుకాణాల మూసివేతకు ఆదేశించారు.