: ఈ ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడు... రోడ్డెక్కిన చిత్తూరు జిల్లా విద్యార్థినులు
చిత్తూరు జిల్లా కొత్తకోట మోడల్ పాఠశాల విద్యార్థినులు వినూత్న నిరసన తెలిపారు. అమ్మాయిలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, నిత్యమూ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, ప్రిన్సిపాల్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ ప్రిన్సిపాల్ కిరణ్ చంద్రకుమార్ గత కొన్ని రోజులుగా అసభ్యంగా మాట్లాడుతున్నాడని, ఈ మాటలు తమకు మనస్తాపం కలిగిస్తున్నాయని మండల విద్యాశాఖాధికారికి వారు వినతిపత్రం అందించారు. అతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఎమ్ఆర్ సీ భవనం ఎదుట ధర్నా చేశారు. దీనిపై విచారించి తగు నిర్ణయం తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.