: స్పేస్ సూట్ డిజైన్ చేయండి... నాసా ఇచ్చే బహుమతి అందుకోండి!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎప్పటికప్పుడు ఔత్సాహికులను ప్రోత్సహించే కార్యక్రమాలతో క్రియాశీలకంగా ఉంటుంది. తాజాగా, అరుణ గ్రహంపై ఉండే క్లిష్టమైన వాతావరణాన్ని ఎక్కువ రోజుల పాటు తట్టుకునేలా ఓ స్పేస్ సూట్ డిజైన్ చేయండంటూ ప్రకటన విడుదల చేసింది. మెరుగైన స్పేస్ సూట్ రూపొందించిన వారికి రూ.19 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్టు పేర్కొంది. అంగారకుడిపై రేడియో ధార్మికత ఎక్కువన్నది తెలిసిందే. మానవ మనుగడకు అది తీవ్ర ప్రతిబంధకం. దీంతో, వ్యోమగాములు దీర్ఘకాలం అక్కడ పరిశోధనలు చేయడం కష్టమవుతుంది. భవిష్యత్తులో సంవత్సరాల పాటు అంగారకుడిపై ఉండాల్సి రావడంతో అందుకు తగిన రక్షణ ఏర్పాట్లు తప్పనిసరి అయ్యాయి. అందుకే, నాసా ఈ స్పేస్ సూట్ డిజైనింగ్ పోటీకి తెరలేపింది.