: డబ్బు సంపాదన కష్టమేం కాదు: చంద్రబాబు
_2808.jpg)
కష్టపడి పనిచేసే వారికి డబ్బు సంపాదించడం చాలా సులువని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉదయం ఉత్తరాఖండ్ లోని ముస్సోరి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో శిక్షణలో ఉన్న ఐఏఎస్ లను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాసేవ చేయాలనుకునే వారు సివిల్స్ కు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో తెలివైన విద్యార్థులంతా సివిల్స్ కు పోటీ పడతారని అన్నారు. ఇండియాలో 3 దశాబ్దాల తరువాత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీకి పార్లమెంటులో పూర్తి మెజారిటీని ప్రజలు ఇచ్చారని గుర్తు చేస్తూ, దక్షిణ కొరియా, సింగపూర్, హాంకాంగ్, చైనా దేశాలు మాత్రమే రెండంకెల వృద్ధి గణాంకాలు సాధించాయని, మోదీ నేతృత్వంలో ఇండియా కూడా ఆ ఘనతను సాధిస్తుందన్న నమ్మకముందని వివరించారు.