: వచ్చే వారంలో రాహుల్ తెలంగాణ పర్యటన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించబోయే 'రైతు సందేశ యాత్ర'లో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొంటారని వీహెచ్ వివరించారు. భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ యాత్ర చేపడుతున్నామన్నారు. తనకు పదవి ఉన్నా, లేకపోయినా ఒకటేనని, రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటానని ఆయన అన్నారు.