: మునిగిపోతున్న ఓడకు ఏచూరి కెప్టెన్: శివసేన


సీపీఎం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన సీతారాం ఏచూరి పైన , ఆ పార్టీపైన శివసేన తీవ్ర విమర్శలు చేసింది. 'మునిగిపోతున్న ఓడకు ఏచూరి కెప్టెన్' అని వ్యాఖ్యానించింది. ఈ లెఫ్ట్ పార్టీ దేశంలో ఔచిత్యం కోల్పోయిందని, బలమైన ప్రతిపక్షంగా ఉండే బలం కూడా లేదని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో ఆక్షేపించింది. "సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ పదవీకాలం వైఫల్యం చెందింది. పశ్చిమబెంగాల్లో మూడు దశాబ్దాల పాటు పాలించిన ఆ పార్టీ మమతా బెనర్జీ రాకతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు లోక్ సభలో 50 మంది సభ్యులతో సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు వారికి కనీసం 10 మంది సభ్యులు కూడా లేరు" అని సేన ఎద్దేవా చేసింది. పార్టీలో వివిధ హోదాల్లో వున్న వారిలో అపారమైన నిరాశ, నైరాశ్యం ఉన్నాయని, వాస్తవానికి ఏచూరి మునిగిపోతున్న ఓడకు కెప్టెన్ అయ్యారని శివసేన వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News