: కేజ్రీవాల్ ను నిలదీసిన ఢిల్లీ ప్రజలు
తమకు నిత్యమూ మురికినీరు సరఫరా చేస్తున్నారని, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈ ఉదయం ఢిల్లీ ప్రజలు నిలదీశారు. తమ ఇండ్లలో సరఫరా అవుతున్న మురికినీటిని బాటిల్స్ లో నింపి తీసుకువచ్చి కేజ్రీవాల్ ముందు పెట్టి నిరసన తెలిపారు. ఆయన ఒక సభలో పాల్గొనగా, అక్కడికి దూసుకువచ్చిన ప్రజలు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సక్రమంగా నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేజ్రీ హామీ ఇచ్చినప్పటికీ, ప్రజల ఆగ్రహం తగ్గలేదు. దీంతో ఆయన వేదిక దిగి వెళ్లిపోయారు.