: జిమ్, ఫిట్ నెస్ సెంటర్ వ్యాపారంలోకి కోహ్లీ
టీమిండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా వ్యాపార రంగంలోకి దిగుతున్నాడు. సొంతంగా పలు జిమ్, ఫిట్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాడు. ఇందులో తన పెట్టుబడి రూ.90 కోట్లు. ఈ వెంచర్ లో కోహ్లీ భాగస్వామి సత్య సిన్హా మాట్లాడుతూ, మూడేళ్లలో 75 కేంద్రాలు ప్రారంభించేందుకు దాదాపు రూ.190 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపాడు. 'చిసెల్' (chisel) అనే బ్రాండ్ పేరుతో జిమ్ లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు. "వివిధ పరిమాణాలు, ప్రదేశాలను బట్టి పలు సౌకర్యాలతో జిమ్ లు ప్రారంభిస్తాము. అంతర్జాతీయ క్రీడా ఆధారిత ఫిట్ నెస్ నిపుణుల నైపుణ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నాం" అని చిసెల్ ఫిట్ నెస్ డైరెక్టర్ సిన్హా చెప్పారు. కోహ్లీ, చిసెల్ ఫిట్ నెస్, సీఎస్ఈ (కోహ్లీ వ్యవహారాలు చూసుకునే సంస్థ)లు సంయుక్త బ్రాండ్ ఇది.