: తెరచుకున్న యమునోత్రి గేట్లు... మొదలైన చార్ ధామ్ యాత్ర


హిందువులు పరమ పవిత్ర యాత్రగా భావించే ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర నేడు ప్రారంభమైంది. ఉదయం 11:30 గంటల సమయంలో యమునోత్రి గేట్లను అధికారులు తెరిచి తొలి బ్యాచ్ భక్తులకు అనుమతి ఇచ్చారు. గంగోత్రి గేట్లు మధ్యాహ్నం 12:30 గంటలకు తెరుస్తామని గంగోత్రి టెంపుల్ ట్రస్ట్ కార్యదర్శి వివరించారు. యాత్రలో అతి ముఖ్యమైన కేదార్ నాథ్ ద్వారాలను 24న, బద్రీనాథ్ ద్వారాలను 26న ఉదయం 5:30 గంటల సమయంలో తెరవనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, సీనియర్ అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలు చార్ ధామ్ ప్రాంతాలను సర్వనాశనం చేయగా, 7 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ దఫా భక్తులకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తామని రావత్ తెలిపారు. సముద్రమట్టానికి 10 వేల అడుగుల ఎత్తుకు పైగా ఉన్న ఈ క్షేత్రాలను విపరీతమైన మంచు కారణంగా అక్టోబర్-నవంబర్ సీజన్లో మూసివేసి మార్చి-ఏ్రపిల్ లో వచ్చే అక్షయ తృతీయ నాడు తిరిగి తెరిచే సంప్రదాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News