: హఫీజ్ వ్యాఖ్యలకు భారత్ తగిన సమాధానం ఇస్తుంది: కేంద్ర ప్రభుత్వం


భారత్ తమ ప్రథమ శత్రువు అంటూ జమాత్ ఉద్ దవా అధినేత, 26/11 ముంబయి దాడుల వ్యూహకర్త హఫీజ్ మహ్మద్ సయీద్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్జు ఏఏన్ఐతో మాట్లాడుతూ, "అటువంటి వ్యక్తులు చేసే అన్ని ప్రకటనలకు వెంటనే స్పందించాల్సిన అవసరంలేదు. ఎవరు బెదిరింపులు చేసినా తగిన సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది" అని పేర్కొన్నారు. ఈ రకమైన అంశాలు (హఫీజ్ సయీద్ వంటి) భారత్ ను బెదిరిస్తూనే ఉంటాయని, అలాగని ఇండియా సాధారణ దేశం కాదని, బాధ్యతాయుతమైన దేశమని కిరణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News